- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
డీఎస్పీ భీం రెడ్డి ఇంటితో పాటు మరో 19 చోట్ల ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.

దిశ, సిటీ క్రైమ్: డీఎస్పీ భీం రెడ్డి ఇంటితో పాటు మరో 19 చోట్ల ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. నగరంలోని నెక్నమ్ పూర్‌లోని ఖరీదైన విల్లాలో భీం రెడ్డి నివాసం ఉంటున్నారు.1995 బ్యాచ్ లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరిన భీం రెడ్డి హైదరాబాద్ నగరంలో అధిక కాలం పని చేశాడు. ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది నారాయణగూడ, చిక్కడిపల్లి, రాయదుర్గం, వనస్థలిపురం తదితర పోలీసు స్టేషన్‌లలో పని చేశాడు. డీఎస్పీగా ప్రమోషన్ తర్వాత పటాన్ చెరు డివిజన్‌లో పని చేశాడు. ప్రస్తుతం సిఐడి డీఎస్పీగా పని చేస్తున్నారు. గతంలో భీం రెడ్డి పలు వివాదాస్పద వ్యవహారాల్లో తలదూర్చడంతో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు.






