- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళపై లైంగికదాడి, న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కాంగ్రెస్ నేత అరెస్ట్!
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగారాంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్ అరెస్ట్ కలకలం రేపింది.

దిశ, శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగారాంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్ అరెస్ట్ కలకలం రేపింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, బ్లాక్‌మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. కంది జ్ఞానేశ్వర్ తనపై లైంగికదాడి చేశాడని ఆరోపించారు. అనంతరం తన వద్ద ఉన్న న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ బెదిరిస్తూ మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ అవసరాల పేరుతో మహిళ నుంచి డబ్బులు తీసుకుని, తిరిగి ఇవ్వాలని అడగడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా చందానగర్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి కంది జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కంది జ్ఞానేశ్వర్ పేరు గతంలో కూడా ప్రభుత్వ భూమికి సంబంధించిన వివాదంలో చందానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం అత్యాచారం కేసులో నిందితుడి పై వచ్చిన ఆరోపణలు పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి మహిళ పై అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపారు. తన ఇంటి సమీపంలో ఉన్న ఆ మహిళను లోబర్చుకొని ఆమెతో ఏకాంతంగా గడిపిన సమయంలో ఫోటోలు వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఆ తదుపరి వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. కంది జ్ఞానేశ్వర్ కు ఇప్పటికే రూ.50 లక్షలు చెల్లించినట్లు బాధితురాలు తెలిపారు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.






