Kasarla Shyam: 'ఆయా షేర్' ఫస్ట్ వెర్షన్ ఓకే అయ్యింది.. కానీ శ్రీకాంత్ ఓదెల మాటతో అంతా మారిపోయింది

by Pulgam srinivas |

'ఆయా షేర్' పాట తొలి వెర్షన్‌కే ఓకే వచ్చింది.. కానీ అనిరుద్, శ్రీకాంత్ ఓదెల సూచనలతో కొన్ని లిరిక్స్‌లో మార్పులు చేశామని కాసర్ల శ్యామ్ వెల్లడించారు.

Kasarla Shyam: ఆయా షేర్ ఫస్ట్ వెర్షన్ ఓకే అయ్యింది.. కానీ శ్రీకాంత్ ఓదెల మాటతో అంతా మారిపోయింది
X

దిశ, వెబ్ డెస్క్: నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండగా, సుధాకర్ చేరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి 'ఆయా షేర్' అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మంచి ఆదరణ పొందింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. తాజాగా ఆయన ఈ పాట వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. 'ఆయా షేర్' పాట తొలి వెర్షన్‌నే ఓకే అయిందని తెలిపారు. అయితే, ఆ తర్వాత కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ పాట కోసం అనిరుద్ ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అలాగే, ఒకరోజు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనకు ఫోన్ చేసి, అనిరుద్ సూచన మేరకు ఇంకొన్ని పదాలు జోడించాలని చెప్పారని తెలిపారు. దానికి అనుగుణంగా పాటలో కొన్ని లిరిక్స్‌ను మార్చినట్లు కాసర్ల శ్యామ్ వెల్లడించారు. ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story