- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INDW vs AUSW Test: ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టు
పింక్ బాల్ టెస్ట్‌లో భారత్‌కు షాక్: ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ విలవిల. తొలి సెషన్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 90/4.

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా టూర్ (Australia tour) లో భాగంగా మొదట జరిగి టీ20 సిరీస్ ను కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఆస్ట్రేలియా మహిళల జట్టు తమ సత్తాను చాటింది. ఈ టూర్ లో భాగంగా ఈ రోజు ఇరు జట్ల మధ్య ఏకైక డే అండ్ నైట్ టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఆదిలోనే ఉహించని షాక్ తగిలింది. 18 పరుగుల వద్ద స్మృతి మందాన, 54 పరుగుల వద్ద షెఫాలి వర్మ, 61 పరుగుల వద్ద ప్రతికా రావల్, 84 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయ్యారు. దీంతో భారత్ మొదటి సెషన్ లో 24 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం జెమిమా రోడ్రిగ్స్ 10, దీప్తి శర్మ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచులో భారత జట్టు ఎన్ని పరుగులు చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
భారత్ ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతికా రావల్, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కెప్టెన్), దీప్తి శర్మ, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సయాలి సత్ఘారే, క్రాంతి గౌడ్
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, అలిస్సా హీలీ (కెప్టెన్), అన్నాబెల్ సదర్లాండ్, బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, అలానా కింగ్, లూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్






