స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త తెలిపిన సెబీ!

by Disha Web Desk 17 |
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త తెలిపిన సెబీ!
X

న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రిటైల్ మదుపర్లకు శుభవార్త అందించింది. యూపీఈ ద్వారా ఐపీఓలలో పాల్గొనే వ్యక్తిగత పెట్టుబడిదారుల బిడ్‌ పరిమితిని పెంచుతూ మార్పులు చేసింది. మంగళవారం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) నుంచి ఐపీఓకు దరఖాస్తు చేసే మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్ణయం తీసుకుంది. పెంచిన పరిమితి నిర్ణయం మే 1న లేదా ఆ తర్వాత స్టాక్ మార్కెట్లలోకి వచ్చే అన్ని ఐపీఓలకు అమలవుతుందని సెబీ వెల్లడించింది. అలాగే, బిడ్-కమ్-దరఖాస్తు ఫారమ్‌లలో వారి యూపీఐ ఐడీని కూడా అందించాలని సెబీ స్పష్టం చేసింది. కాగా 2018, నవంబర్‌లో ఐపీఓల కోసం బిడ్ వేసేందుకు యూపీఐ వినియోగాన్ని సెబీ ప్రారంభించింది. ఇది 2019, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.


Next Story

Most Viewed