'మెలోడీ' ట్రెండింగ్.. ఇండియన్ పోస్టల్ వాడకం మాములుగా లేదుగా!

by Muthe.Rajitha |

భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల స్నేహాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో 'మెలోడీ' అనే పదం బాగా ఫేమస్ అయింది.

మెలోడీ ట్రెండింగ్.. ఇండియన్ పోస్టల్ వాడకం మాములుగా లేదుగా!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల స్నేహాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ‘మెలోడీ’ (Melodi) అనే పదం బాగా ఫేమస్ అయింది. ఇటీవల ప్రధాని మోదీ, ఇటలీ ప్రధానికి ‘మెలోడీ’ చాక్లెట్లు ఇచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల మీమ్స్ (Memes) వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సంస్థ అయిన 'ఇండియా పోస్ట్' (India Post) కూడా ఈ ట్రెండ్‌ను వాడుకుని తమ సేవల గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా 'మూమెంట్‌ మార్కెటింగ్' పద్ధతిని ఇప్పుడు ఇండియా పోస్ట్ ఉపయోగించింది.

తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఇండియా పోస్ట్ రెండు పోస్టర్లను షేర్ చేసింది. మొదటి పోస్టర్‌లో మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను చూపిస్తూ, "దీన్ని మరుసటి రోజు కల్లా ఆమెకు ఎలా పంపించాలి?" అని ప్రశ్నించింది. ఆ వెంటనే రెండో పోస్టర్‌లో, "దానికి మన #24 స్పీడ్‌ పోస్ట్ (24SpeedPost) సేవలు ఉన్నాయిగా!" అంటూ సమాధానమిచ్చి, తమ డెలివరీ సేవల వేగాన్ని ప్రమోట్ చేసుకుంది. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు చాలా సీరియస్‌గా ఉంటాయనే అంచనాలకు భిన్నంగా, ఇండియా పోస్ట్ ఇలా సరదాగా మీమ్స్ ఉపయోగించి ప్రచారం చేయడం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.

Next Story