- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలి
థర్డ్ లైన్ స్పీడ్ ట్రయల్ సందర్భంగా మంగళవారం ఆసిఫాబాద్ రోడ్ (రెబ్బెన) రైల్వే స్టేషన్‌ను సందర్శించిన సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణకు స్థానిక నాయకులు వినతిపత్రం అందజేశారు.

దిశ, రెబ్బెన : థర్డ్ లైన్ స్పీడ్ ట్రయల్ సందర్భంగా మంగళవారం ఆసిఫాబాద్ రోడ్ (రెబ్బెన) రైల్వే స్టేషన్‌ను సందర్శించిన సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణకు స్థానిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌లో 17003/17004 భద్రాచలం రోడ్–బలార్షా ప్యాసింజర్, 12757/12758 సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, 16094 లక్నో–చెన్నై ఎక్స్‌ప్రెస్, 12655 అహ్మదాబాద్–చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని, అలాగే స్టేషన్‌ను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
గోలేటి సింగరేణి టౌన్‌షిప్‌తో పాటు ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, రెబ్బెన, భీమిని మండలాల ప్రజలు ఈ స్టేషన్‌పై ఆధారపడుతున్నారని, ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సింగరేణి కార్మికులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు సుదర్శన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వినోద్ జైస్వాల్, నవీన్ జైస్వాల్, వాసురాం నాయక్, జహీర్ బాబా, మహేష్, అఫ్రోజ్ అలీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.






