- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
ఢిల్లీలో ప్రధాని నివాసం ముట్టడికి కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి చర్చలు జరపడం ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: చలో పార్లమెంట్ కార్యక్రమం సందర్భంగా నిన్న సీజేపీ మద్దతుదారులపై పోలీసుల లాఠీచార్జి, నీట్ అవకతవకలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగింది. ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలంతా ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసం ముట్టడికి పాదయాత్రగా వెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దాదాపు గంటన్నరకు పైగా కాంగ్రెస్ అగ్రనేతలు ఆందోళనకు దిగడంతో రాహుల్ గాంధీకి నచ్చచెప్పడానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న చోటికి స్వయంగా కేంద్ర మంత్రి వచ్చి రాహుల్ గాంధీతో చర్చల జరిపారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. కాగా యువతపై లాఠీచార్జికి బాద్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠగా మారింది.






