అర్జెంటీనా, స్పెయిన్ ప్లేయర్ల గొడ‌వ‌పై ఫిఫా సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక వాళ్లు జైలుకే!

by velandi.Saikiran |

అర్జెంటీనా, స్పెయిన్ ప్లేయర్ల గొడ‌వ‌పై ఫిఫా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

అర్జెంటీనా, స్పెయిన్ ప్లేయర్ల గొడ‌వ‌పై ఫిఫా సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక వాళ్లు జైలుకే!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026 సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్, అర్జెంటీనా తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 1-0 తేడాతో గెలిచి... టైటిల్ కైవసం చేసుకుంది స్పెయిన్. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే అర్జెంటీనా ఆటగాళ్లు కాస్త ఓవర్ గా బిహేవ్ చేశారు. ఓటమిని తట్టుకోలేక స్పెయిన్ కుర్రాళ్లతో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఇరు ప్లేయర్ల మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే ఈ సంఘటనపై తాజాగా ఫిఫా కీలక ప్రకటన చేసింది.

ప్లేయర్లు కొట్టుకున్న సంఘటనపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే మ్యాచ్ రిపోర్టులను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. దర్యాప్తునకు డిసిప్లినరీ అలాగే ఎథిక్స్ ప్రాసిక్యూటర్ ను నియమించినట్లు కీలక ప్రకటన చేసింది. దీనిపై విచారణ పూర్తయిన తర్వాత వివరాలను బహిర్గతం చేస్తామని తెలిపింది ఫిఫా. ఈ సంఘటనలో తప్పు ఎవరు చేసినా, కట్టిన శిక్ష తప్పదని హెచ్చరించింది.

Next Story