- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంట్రల్ ఆసియా దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు
సెంట్రల్ ఆసియా దేశాలకు ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : సెంట్రల్ ఆసియా దేశాలకు ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరాన్ గగనతలం మూసివేయడంతో.. ఇండిగో ఇండిగో విమాన సంస్థ సెంట్రల్ ఆసియా, కాకేసస్ దేశాలకు వెళ్లే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నిర్ణయం రానున్న ఫిబ్రవరి 11 వరకు అమల్లో ఉండనుండి. జార్జియాలోని తబిలిసి, కజకిస్తాన్‌లోని అల్మాటీ, అజర్‌బైజాన్‌లోని బాకు, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ నగరాలకు వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే ఇండిగో విమానాలు నిలిచిపోనున్నాయి. సాధారణంగా ఈ విమానాలు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తాయి. అయితే ప్రస్తుతం ఇరాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిస్థితులు బాగోలేకపోవడంతో ఆ గగనతలం గుండా వెళ్లడం సురక్షితం కాదని ఇండిగో భావించింది.
ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది భద్రతే ముఖ్యమని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇండిగో వెబ్‌సైట్ లేదా యాప్‌లో తమ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, అవసరమైతే రీఫండ్ లేదా రీబుకింగ్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సూచించింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని, అప్పటివరకు ప్రయాణికులు అప్‌డేట్స్‌ను గమనించాలని తెలిపింది.






