- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమాసియాలో శాంతికి భారత్ మద్దతు.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన!
పశ్చిమాసియా కాల్పుల విరమణను స్వాగతించిన భారత్! చర్చలే పరిష్కారమని విదేశాంగ శాఖ వెల్లడి. ప్రపంచ వాణిజ్యం పుంజుకోవాలని ఆకాంక్ష.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ (Ceasefire between America and Iran) ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రెండు వారాల పాటు ఇరువైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ పరిణామాలను భారత్ మనస్ఫూర్తిగా స్వాగతించింది. ఈ పరిణామం పశ్చిమాసియాలో ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs of India) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వివాదాల పరిష్కారానికి భారత్ మొదటి నుండి చెబుతున్నట్లుగా కేవలం చర్చలు, దౌత్య మార్గాలు, ఉద్రిక్తతల తగ్గింపు (De-escalation) ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా భారత్ పునరుద్ఘాటించింది. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే సామాన్య ప్రజలు అపారమైన కష్టాలను అనుభవించారని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రపంచ వాణిజ్యానికి ఊరట
యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థలు, వాణిజ్య మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని భారత్ ఆకాంక్షించింది. ప్రపంచ వాణిజ్య ప్రవాహం తిరిగి గాడిలో పడటం, అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ శాంతి ప్రక్రియ పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.






