- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్.. టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ మునుపెన్నడూ లేని భారీ రికార్డు
భారత జట్టు మరోసారి తమకు టీ20లో తిరుగులేదని నిరూపించింది. ఇప్పటి వరకు వరుసగా 10 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు మరోసారి తమకు టీ20లో తిరుగులేదని నిరూపించింది. ఇప్పటి వరకు వరుసగా 10 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో భారీ విజయం సాధించిన సిరీస్ ను 3-0 తో సొంతం చేసుకుంది. అలాగే ఈ మ్యాచులో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కులు చూపించి సరికొత్త చరిత్ర సృష్టించారు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై 150కి పైగా పరుగుల టార్గెట్‌ను అత్యధిక బంతులు (60 బంతులు/10 ఓవర్లు) మిగిలి ఉండగానే ఛేదించిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ (37 బంతులు) పేరిట ఉండగా, అభిషేక్ శర్మ (68), సూర్యకుమార్ యాదవ్ (57*) మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ దానిని తిరగరాసింది. అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత విజయంతో టీమ్ ఇండియా మరిన్ని అరుదైన మైలురాళ్లను అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11 సిరీస్‌లు గెలిచిన పాకిస్థాన్ రికార్డును భారత్ సమం చేసింది. అలాగే, స్వదేశంలో వరుసగా 10 టీ20 సిరీస్‌లు గెలుచుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి జట్టుగా టీమ్ ఇండియా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.






