- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తీవ్ర అల్లర్లు, ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్, భద్రతా సమస్యలు పెరగడంతో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొదటి బ్యాచ్‌గా 292 మంది భారతీయులు శనివారం తెల్లవారుజామున టెహ్రాన్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మెడికల్ విద్యార్థులు, ఉమ్రా యాత్రికులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇరాన్ ఎయిర్‌స్పేస్ తాత్కాలికంగా తెరవడంతో చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా ఈ ఎవాక్యుయేషన్ సాధ్యమైంది.
స్వదేశానికి వచ్చిన భారతీయులు అక్కడి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని, ఇంటర్నెట్ నిలిపివేయడంతో కుటుంబాలతో సంబంధం కోల్పోయామని తెలిపారు. భారత ఎంబసీ, ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా తిరిగి వచ్చామని భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా 800 మందికి పైగా భారతీయులు తరలింపు కోసం నమోదు చేసుకున్నారని.. వీలైనంత త్వరగా వారిని కూడా స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.






