- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం మధ్య సురక్షితంగా స్వదేశానికి.. పీవీ సింధుతో పాటు భారతీయుల రాక
యూఏఈ నుండి భారతీయుల తరలింపు షురూ! సురక్షితంగా స్వదేశం చేరిన పీవీ సింధు. ఢిల్లీ, ముంబైకి చేరుకున్న 4 ప్రత్యేక విమానాలు.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఇరాన్ పై జరిపిన వైమానిక దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో యుద్ధం ముదురుతున్న తరుణంలో, యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ప్రత్యేక విమాన సేవలు షురూ అయ్యాయి. ఇరాన్ దాడుల వల్ల గగనతలం (Airspace) మూసివేయడంతో గత మూడు రోజులుగా వేలాది మంది ప్రయాణికులు దుబాయ్, అబుదాబి విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు.
అయితే, పరిస్థితులు కొంత చక్కబడటంతో ఎతిహాద్ ఎయిర్ లైన్స్ (Etihad Airways) అబుదాబి నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతోంది. తాజాగా అబుదాబి నుంచి 300 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు విమానాలు భారత్‌కు చేరుకోగా, ముంబై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో కూడా విమానాలు ల్యాండ్ అయ్యాయి. తమ వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందబాష్పాలతో స్వాగతం పలికారు.
సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు..
ఈ సంక్షోభంలో చిక్కుకుపోయిన వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్తుండగా, దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో సింధు, ఆమె సహాయక సిబ్బంది అక్కడే ఉండిపోయారు. విమానాశ్రయ సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించడంతో ఒక దశలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, భారత రాయబార కార్యాలయం చొరవతో ఆమె సురక్షిత ప్రాంతానికి తరలించబడ్డారు. తాజాగా పునఃప్రారంభమైన విమాన సర్వీసుల ద్వారా సింధు తన టీమ్‌తో కలిసి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. తన భద్రత కోసం కృషి చేసిన భారత ప్రభుత్వం, ఎంబసీ అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






