పర్షియన్ గల్ఫ్ లో భారత యుద్ధ నౌకలు

by Muthe.Rajitha |

మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత్ తన యుద్ధ నౌకలను మోహరించింది.

పర్షియన్ గల్ఫ్ లో భారత యుద్ధ నౌకలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను మోహరించింది. దేశానికి ముడి చమురు, ఎల్పీజీ మోసుకొచ్చే ట్యాంకర్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నౌకలు 'స్టాండ్‌బై'లో ఉన్నాయి. భారత నౌకల భద్రతను పర్యవేక్షించేందుకు 'ఆపరేషన్ సంకల్ప్' కింద కోల్‌కతా, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లను రంగంలోకి దించినట్లు సమాచారం. భారత నావికాదళం కేవలం రక్షణ కోసమే కాకుండా, అవసరమైతే సముద్రంలో చిక్కుకున్న నౌకలకు మానవీయ సహాయం (Humanitarian Assistance) అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది.

మరోవైపు ఎల్పీజీతో వస్తున్న భారత నౌక 'శివాలిక్' (Shivalik) ఇప్పటికే హార్మూజ్ జలసంధిని దాటి క్షేమంగా ముందుకు సాగుతోంది. ఇది మార్చి 21 నాటికి భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌తో ఉన్న మైత్రి దృష్ట్యా మరో రెండు నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతినిచ్చింది. వీటి ద్వారా సుమారు 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు చేరుతోంది. ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ మాట్లాడుతూ.. భారత్ తమకు మంచి మిత్రదేశమని, భారత నౌకల రాకపోకలకు తాము ఎటువంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ఓడరేవుల & షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక 'క్విక్ రెస్పాన్స్ టీమ్' ఏర్పడింది. ఇది గల్ఫ్ ప్రాంతంలో ఉన్న సుమారు 668 మంది భారతీయ నావికుల భద్రతను 24/7 పర్యవేక్షిస్తోంది.

Next Story