భారత షట్లర్ దేవికా సిహాగ్ విక్టరీ

by Muthe.Rajitha |

భారత షట్లర్ దేవికా సిహాగ్ థాయ్‌లాండ్ సూపర్‌ 300 మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

భారత షట్లర్ దేవికా సిహాగ్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత షట్లర్ దేవికా సిహాగ్ థాయ్‌లాండ్ మాస్టర్స్‌ 2026 (సూపర్‌ 300) మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేవలం 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ ర్యాంకింగ్‌లో 63వ స్థానంలో ఉన్న దేవికా ఫైనల్‌లో మలేషియా షట్లర్ గో జిన్‌ వీపై అద్భుతంగా ఆడి, విజయం సొంతం చేసుకుంది. తొలి గేమ్‌ను 21–8తో సులువుగా గెలిచిన దేవికా.. రెండో గేమ్‌లో 6–3తో ముందుండగా గో జిన్‌ వీ హామ్‌స్ట్రింగ్‌ గాయంతో మ్యాచ్‌ను వదిలేసింది. దీంతో దేవికా తొలి BWF వరల్డ్‌ టూర్‌ టైటిల్‌తో పాటు తొలి సూపర్‌ 300 టైటిల్‌ విజేతగా నిలిచింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాత ఈ విజయం సాధించిన మూడో భారత మహిళా షట్లర్‌గా దేవికా చరిత్ర సృష్టించింది.

టోర్నమెంట్‌ మొత్తం ఆమె ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా, టాప్‌ సీడ్‌ సుపనిదా కతేథాంగ్‌, ఐదో సీడ్‌ హువాంగ్‌ యు-హ్సున్‌లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ను ఓడించి ఈ ఘన విజయం సాధించింది. మరోవైపు 2026లో భారత్‌కు వచ్చిన తొలి బ్యాడ్మింటన్‌ టైటిల్‌ కూడా ఇదే కావడం విశేషం.

Next Story