- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనెజువెలాలో భారత నావికుడు మృతి.. అంతర్గత అవయవాలు మాయం!
వెనెజువెలాలో భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ అనుమాస్పద స్థితిలో మృతి చెందడం, ఆ తర్వాత ఆయన డెడ్ బాడీలో అంతర్గత అవయవాలు మాయమవ్వడం తీవ్ర సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : వెనెజువెలాలో భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ అనుమాస్పద స్థితిలో మృతి చెందడం, ఆ తర్వాత ఆయన డెడ్ బాడీలో అంతర్గత అవయవాలు మాయమవ్వడం తీవ్ర సంచలనం రేపింది. ఇటీవల అధికారులు ఆయన మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చినప్పుడు, శరీరంలో కీలకమైన అవయవాలు లేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (FSUI) స్పందించింది. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల రక్షణను ప్రస్తావిస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను (MEA) డిమాండ్ చేసింది.
సాధారణంగా అంతర్జాతీయంగా మృతదేహాలను ఇతర దేశాలకు తరలించేటప్పుడు 'ఎంబాల్మింగ్' అంటే మృతదేహం పాడవకుండా చేసే ప్రక్రియ కోసం కొన్ని అవయవాలను తొలగించే పద్ధతి ఉన్నప్పటికీ, ఈ కేసులో అసలు ఏం జరిగిందనేది పూర్తి నివేదిక వస్తేనే స్పష్టమవుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఈ ఘటనపై నిజాలు నిగ్గుతేల్చడానికి భారతదేశంలో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించడం అత్యంత కీలకంగా మారనుంది. దీని ద్వారా ఏయే అవయవాలు తొలగించబడ్డాయో ఆధారాలు లభిస్తాయి. భారత విదేశాంగ శాఖ వెనెజువెలా ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపి, అక్కడి స్థానిక అధికారుల నుండి పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను తెప్పించాలని FSUI ప్రభుత్వాన్ని కోరుతోంది.






