- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత ఎన్నికలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
భారత ఎన్నికలు దేశ సాంస్కృతిక వైవిధ్యానికి, ఐక్యతకు నిదర్శనం. యువ ఓటర్ల భాగస్వామ్యం అద్భుతం" - ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Assembly Election Schedule) విడుదల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ (Central Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే కాదని, భారతదేశపు అపారమైన సాంస్కృతిక వైభవాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే గొప్ప సందర్భాలని ఆయన మీడియా సమావేశంలో అభివర్ణించారు. దేశంలోని వివిధ భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా భారతీయత ఉట్టిపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా సవరణ (SIR)లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన క్షేత్రస్థాయి అధికారులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
యువత, తొలిసారి ఓటు వేయబోతున్న నవ ఓటర్ల ఉత్సాహంపై సీఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. 'స్వీప్' (SVEEP) ఐకాన్ల ద్వారా ఓటర్లలో చైతన్యం కల్పిస్తున్నామని, ముఖ్యంగా యువ ఓటర్లతో జరిపిన సంప్రదింపులు తమలో ఎంతో నమ్మకాన్ని నింపాయని ఆయన వెల్లడించారు. పారదర్శకత, శాంతియుత వాతావరణమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, ప్రతి ఓటరు ఈ 'ప్రజాస్వామ్య పండుగ'లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






