- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ అలర్ట్: తక్షణమే ఇరాన్‌ను వీడాలని భారత పౌరులకు సూచన
ఇరాన్‌లో మారుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉన్న భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆర్థికమాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో గత కొన్ని రోజులుగా ఇరాన్‌లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారింది. కొనుగోలు శక్తి తగ్గడం, నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, సామాన్య ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల మోహరింపు పెరిగింది. మరోవైపు, ఇరాన్, అమెరికా మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న ఆందోళనల మధ్య, అక్కడ ఉన్న విదేశీయుల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
భారత ఎంబసీ అలర్ట్..
అమెరికా హెచ్చరికలు, యుద్ధానికి సై అంటున్న ఇరాన్ తీరును, తాజా పరిణామాలను గమనించిన టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాలు, ఇతర మార్గాల ద్వారా తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశించింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ స్పష్టం చేసింది.
సహాయం- రిజిస్ట్రేషన్
ఇరాన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంకా ఎంబసీలో రిజిస్టర్ చేసుకోని వారు వెంటనే ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి; ఇంటర్నెట్ అంతరాయం ఉంటే భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అత్యవసర సహాయం కోసం +98 912 810 9115 వంటి హెల్ప్‌లైన్ నెంబర్లు [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.






