ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ విజేతగా భారత్.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం

by Malleboina Mahesh |   (  Updated:2026-02-22 11:22:47  IST  )

"ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఛాంపియన్‌గా భారత్! ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 46 పరుగుల తేడాతో ఘన విజయం. తేజల్ హాఫ్ సెంచరీ, ప్రేమ రావత్ 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన."

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ విజేతగా భారత్.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్: బ్యాంకాక్ వేదికగా ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీ (Asia Cup Rising Stars-2026 Tournament) జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల-A జట్టు (India Women's A Team) జయకేతనం ఎగురవేసింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో బంగ్లాదేశ్-A జట్టుపై 46 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడుతూ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించగా, కెప్టెన్ రాధా యాదవ్ (36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు (Bangladesh team) భారత బౌలర్లు చుక్కలు చూపించడంతో బ్యాటింగ్ చేయడానికి విలవిలలాడారు. భారత స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు 19.1 ఓవర్లలో కేవలం 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ప్రేమ రావత్ 3 వికెట్లతో చెలరేగగా, సోనియా మెందియా, తనూజా కన్వర్ తలో రెండు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత మహిళల-A జట్టు ఆసియా ఖండంలో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

Next Story