- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్ణయాత్మక మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్‌లో ఈ రోజు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్‌లో ఈ రోజు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ప్రారంభమైంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచుల్లో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1-1తో సమం చేశారు. కాగా ఈ మ్యాచులో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు గెలుపుకోసం శ్రమించారు. దీంతో నేటి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ గా కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నేటి మ్యాచులో భారత జట్టులోకి భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. యువ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
శుభ్‌మన్ గిల్
కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ జట్టు తమను ఒత్తిడిలోకి నెట్టడం ఒక మంచి సవాలు అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఆటగాళ్లు తమ సత్తా చాటుకోవాలని భారత కెప్టెన్ గిల్ పేర్కొన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉండటంతో లక్ష్యాన్ని ఛేదించడమే సరైన నిర్ణయమని ఆయన భావించారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంపై తాము దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గిల్ తెలిపారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేసి.. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.
మైఖేల్ బ్రేస్‌వెల్
టాస్ ఓడిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్ వెల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడు ముందుగా బ్యాటింగ్ చేసే మైండ్‌సెట్‌కు మారిపోయామని బ్రేస్‌వెల్ చెప్పారు. భారత్‌లో వన్డే సిరీస్ గెలవడం అనేది తమకు దక్కిన ఒక గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టులోని కొత్త ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడుతున్నారని, ఒత్తిడిలో వారు ఎలా ఆడతారో చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. కివీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నారు.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్
భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్






