వేగం పెంచిన భారత్.. వచ్చే రెండు రోజుల్లో 7,400 పౌరుల తరలింపు

by Manoj |   (  Updated:2022-03-04 06:47:43  IST  )

వేగం పెంచిన భారత్.. వచ్చే రెండు రోజుల్లో 7,400 పౌరుల తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 6,400 మందిని ఆపరేషన్ గంగా కిందకు తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 7,400 మంది భారతీయులు వచ్చే రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వస్తారని అంచనా వేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో పద్దెనిమిది విమానాలు షెడ్యూల్ చేయడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

Next Story