మిడిల్ ఈస్ట్ దేశాల్లో చిక్కుకున్నారా? ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి

by Muthe.Rajitha |

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయాలు అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో చిక్కుకున్నారా? ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకోవడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. టెహ్రాన్ సమీపంలోని రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో యుద్ధం ఏ క్షణమైనా పెను విపత్తుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు ఒమన్ వంటి దేశాల్లో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు మరియు నావికుల భద్రత కోసం భారత విదేశీ వ్యవహారాల శాఖ (MEA) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. యుద్ధ భూమిలో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు తక్షణ సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.

భారత విదేశాంగ శాఖ కంట్రోల్ రూమ్ (న్యూఢిల్లీ):

ఈ కంట్రోల్ రూమ్ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భారత పౌరులు వారి కుటుంబ సభ్యులు తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800118797 ను సంప్రదించవచ్చు. అలాగే ఇతర అత్యవసర నంబర్లు +91 11 2301 2113, +91 11 2301 4104, మరియు +91 11 2301 7905 ద్వారా కూడా అధికారులతో నేరుగా మాట్లాడవచ్చు.

యుద్ధం ఎక్కువగా ప్రభావితం చూపుతున్న మిడిల్ ఈస్ట్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా ప్రత్యేక నంబర్లను విడుదల చేశాయి.

బహ్రెయిన్‌: +973 39418071

ఇరాన్: +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359

ఇరాక్‌: +964 771 651 1185, +964 770444 4899

ఇజ్రాయెల్: +972 54 7520711, +972 54 2428378

జోర్డాన్: +962 770 422 276

కువైట్: +965 65501946

లెబనాన్: +961 76860128

ఒమన్: +968 98282270, 80071234(టోల్ ఫ్రీ)

ఖతార్: +974 55647502

రమల్లా, పాలస్తీనా: +970 592916418

రియాద్: +966 11 4884697, 800 247 1234 (టోల్ ఫ్రీ),

జెడ్డా: +966 126648660, +966 12 2614093

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: +971 543090571, 800 46342 (టోల్ ఫ్రీ)

అలాగే యుద్ధ నేపథ్యంలో భారతీయులందరూ రాయబార కార్యాలయాల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Next Story