గాజా శాంతి బోర్డులోకి భారత్‌కు ఆహ్వానం

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది.

గాజా శాంతి బోర్డులోకి భారత్‌కు ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. ఈ మండలిలో ఇప్పటికే ఇండో-అమెరికన్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగాకు చోటు దక్కింది. ఇదే సమయంలో పాకిస్తాన్ కు కూడా ఆహ్వానం అందినట్టు సమాచారం. గాజా పరిపాలన, పునర్నిర్మాణ పనుల కోసం అమెరికా రెండు ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానమైన శాంతి మండలికి ట్రంప్‌ స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ మండలిలో సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఉంటారు. దీనికి సహాయకంగా పనిచేసే మరో ‘ఎగ్జిక్యూటివ్‌ బోర్డు’ కూడా ఉంటుంది. ఈ రెండో మండలి ప్రధాన బోర్డుకు సలహాలు ఇవ్వనుంది. అయితే ఈ కార్యనిర్వాహక మండలిలో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఇజ్రాయెల్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story