గిల్గిత్ - బాల్టిస్థాన్‌లో ఎన్నికలు.. భారత్ ఆగ్రహం

by Muthe.Rajitha |

PoK పరిధిలోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు పాక్ తీసుకున్న నిర్ణయంపై భారతదేశం అత్యంత తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

గిల్గిత్ - బాల్టిస్థాన్‌లో ఎన్నికలు.. భారత్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(PoK) పరిధిలోని గిల్గిత్-బాల్టిస్థాన్(Gilgit-Baltistan) ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారతదేశం అత్యంత తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. జూన్ 7 నాడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ (MEA) పాక్ చర్యలను తీవ్రంగా ఖండించింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌తో పాటు యావత్ జమ్మూ-కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలన్నీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అంతర్భాగాలని, అవిభాజ్య భాగాలని మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ తన అక్రమ ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ రాజకీయంగా ప్రాబల్యం సాధించడానికి ఇలాంటి ఏకపక్ష నాటకాలకు తెరలేపినా.. చారిత్రక, భౌగోళిక వాస్తవాలను ఎన్నటికీ మార్చలేవని భారత విదేశాంగ శాఖ గట్టిగా హెచ్చరించింది.

బలవంతంగా, చట్టవిరుద్ధంగా భారత భూభాగాలను ఆక్రమించుకున్న పాకిస్థాన్‌కు.. ఆయా ప్రాంతాలపై ఎలాంటి ఎన్నికలు జరిపే హక్కు, అర్హత లేవని ఢిల్లీ స్పష్టం చేసింది. పాక్ ప్రభుత్వం తక్షణమే గిల్గిత్-బాల్టిస్థాన్ సహా తాము అక్రమంగా ఆక్రమించిన అన్ని భారతీయ భూభాగాల నుండి పూర్తిగా వైదొలగాలని భారత్ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు కేవలం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచడానికే తోడ్పడతాయని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసే ఏ చర్యలనైనా దేశం సహించబోదని స్పష్టం చేసింది.

Next Story