సరికొత్త ఎత్తులకు భారత్-అరబ్ బంధం.. ప్రధాని మోడీ ఆకాంక్ష

by Malleboina Mahesh |

అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, అరబ్ లీగ్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.

సరికొత్త ఎత్తులకు భారత్-అరబ్ బంధం.. ప్రధాని మోడీ ఆకాంక్ష
X

దిశ, వెబ్ డెస్క్: అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, అరబ్ లీగ్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. అరబ్ ప్రపంచం భారతదేశానికి ఒక విస్తరించిన పొరుగు ప్రాంతం (Extended Neighbourhood) వంటిదని ప్రధాని అభివర్ణించారు. రెండు ప్రాంతాల మధ్య లోతైన నాగరికత బంధాలు, శక్తివంతమైన ప్రజల మధ్య సంబంధాలు, శాశ్వతమైన సోదర సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. శాంతి, ప్రగతి, స్థిరత్వం పట్ల మనకున్న ఉమ్మడి నిబద్ధత ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సాంకేతికత, ఇంధనం, వాణిజ్యం, ఆవిష్కరణల (Innovation) రంగాలలో పెంపొందించుకునే సహకారం సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలకు చేరుకుంటుందనే నమ్మకాన్ని ప్రధాని మోడీ తన ట్వీట్ ద్వారా వెలిబుచ్చారు.

Next Story