IND Vs NZ: వాషింగ్టన్ సుందర్‌‌కు గాయం.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |

న్యూజిలాండ్‌ (New Zealand)తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా (Team India)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

IND Vs NZ: వాషింగ్టన్ సుందర్‌‌కు గాయం.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌ (New Zealand)తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా (Team India)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీకి చెందిన యువ బ్యాటర్ ఆయుష్ బదోని (Ayush Badoni)ని జట్టులోకి తీసుకుంటున్నట్లగా అధికారికి ప్రకటన విడుదలైంది. ఇక ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున, అలాగే దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టు తరపున బదోని నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా బెస్ట్ ఫినిషర్‌గా, ఆఫ్‌ స్పిన్నర్‌గా రెండో వన్డే నాటికి బదోని జట్టుతో చేరునున్నాడు.

కాగా, వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ తన ఎడమ వైపు కింది పక్కటెముకల భాగంలో తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన సుందర్, ఆ తర్వాత మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, బ్యాటింగ్‌లో మాత్రం ఇబ్బంది పడుతూనే జట్టు విజయం కోసం క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం అతని గాయానికి సంబంధించి స్కానింగ్ నిర్వహించనున్నట్లు, వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు బోర్డు తెలిపింది.

Next Story