IND Vs NZ: రాజ్‌కోట్‌లో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-14 08:32:34  IST  )

IND Vs NZ: రాజ్‌కోట్‌లో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య జరుగుతున్న రాజ్‌కోట్‌ (Rajkot)లోని నిరంజన్ షా స్టేడియంలో రెండో వన్డే ప్రారంభమైంది. ఈ కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇక వడోదరలో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్, ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో కూడా గెలిస్తే, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం టీమిండియాకు ఉంది.

భారత జట్టులో ఒకే ఒక్క మార్పు..

గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy) తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ (93), కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలపైనే అందరి కళ్లు ఉన్నాయి. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ మరో 34 పరుగులు చేస్తే వన్డేల్లో వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తారు. అదేవిధంగా రాజ్‌కోట్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఇవాళ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, జేడెన్ లెన్నాక్స్.

Next Story