IND Vs NZ: కివీస్ బౌలర్లను ఉతికారేసిన అభిషేక్ శర్మ.. ప్రస్తుతం భారత్ స్కోర్ ఇదే

by Kema Shiva Kumar |

నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో భారత్ టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్‌కు దిగింది.

IND Vs NZ: కివీస్ బౌలర్లను ఉతికారేసిన అభిషేక్ శర్మ.. ప్రస్తుతం భారత్ స్కోర్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: నాగ్‌పూర్ (Nagpur) వేదికగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరుగుతోన్న తొలి టీ20లో భారత్ (India) టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే శాంసన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుటైనప్పటికీ, మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. బౌలర్ ఎవరైనా సరే బంతి బౌండరి అవతలే అన్నట్లుగా విరుచుకుపడ్డాడు. అతడు కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేసి ఇష్ సోదీ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఇక రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. 5 బంతుల్లో 8 పరుగులు చేసి జాకబ్ డఫీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చాలా కాలం తర్వాత కాస్త ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనిపించాడు. 22 బంతుల్లో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ వెంటనే శివమ్ దూబే 9 పరుగులు చేసి అవుటయ్యాడు. 14 ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత్ 5 కీలక వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 12 పరుగులు, రింకు సింగ్ (0)తో క్రీజ్‌లో ఉన్నారు. ఇక కివీస్ బౌలర్లలో కైల్ జెమీసన్ 2, జాకబ్ డఫీ, ఇష్ సోదీ, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు.

Next Story