బయటకు రావొద్దు.. తెలంగాణలో మండుతున్న ఎండలు

by samatah |

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బయటకు రావొద్దు.. తెలంగాణలో మండుతున్న ఎండలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని వాతావరణశాఖ తెలిపింది. అలాగే రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొంది. బయటకు వెళ్లేవారు తప్పకుండా తమ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించింది.

Next Story