- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
by Malleboina Mahesh |
తిరుమలలో భక్తుల తాకిడి పెరగడంతో సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న 67 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.3.9 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో తిరుమల తిరుపతి (Tirumala Tirupati) పుణ్యక్షేత్రం లో భక్తుల రద్ధీ భారీగా పెరిగింది. శనివారం ఉదయం కూడా శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో, మిగిలిన వారు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో దర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 67,222 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 33,188 మంది భక్తులు మొక్కుబడిగా తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.9 కోట్ల ఆదాయం లభించింది.
Next Story






