State Revenue: పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం

by Malleboina Mahesh |   (  Updated:2026-03-22 03:35:12  IST  )

తెలంగాణ ఆదాయంలో జోరు! 2024-25తో పోలిస్తే పెరిగిన పన్ను రాబడి. ఈ వృద్ధిని ఆధారంగా చేసుకుని 2026-27 బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్ల అదనపు అంచనాలు.

State Revenue: పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగినట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. స్టేట్​ఓన్​టాక్స్​రెవెన్యూ (ఎస్​వోటీఆర్​)తో సహా ఎస్​జీఎస్టీ, సేల్స్​టాక్స్, స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్​టాక్స్, మోటార్​వెహికిల్ టాక్స్ పన్నులపై ఎకానామిక్​అవుట్ లుక్ ​నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో పెరిగిందని వివరాలను వెల్లడిస్తున్నాయి.

20 వేల కోట్ల అంచనా

ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొదటి మూడు క్వార్టర్స్​లో విభాగాల వారిగా ఆదాయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగా ఉంటుందనే అంచనాతోనే గత బడ్జెట్​కంటే 20వేల కోట్ల అంచనాలను పెంచి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, మెట్రో, బుల్లెట్​ ట్రైన్, మూసీ, ఫ్యూచర్​ సిటీ, ట్రిపుల్​ఆర్​తదితర వాటి ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

Next Story