కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

by Batti.Sumithra |

కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు మాధవనేని రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మన్, జనగామా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి, కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్ నుంచి సిద్దిపేట – సికింద్రాబాద్ డెమూ రైలు నంబర్ 77654 ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సికింద్రాబాద్ కు రైలులో బయలు దేరారు.

Next Story