- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడి కళ్లెదుటే యువతిపై అత్యాచారం.. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు షాక్!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.- latest Telugu news

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు విధించినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఓ చోట రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఓ యువతిపై కొందరు కామాంధులు ఆమె లవర్ ముందే అత్యాచారం చేశారు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోటలో ఓ ప్రేమ జంట సరదాగా బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తుండగా.. వీరిని గమనించిన ముగ్గురు యువకులు వీరి దగ్గరికి వచ్చారు. ప్రియురాలి కళ్లేదుటే యువకుడిని దారుణంగా కొట్టి.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం యువతి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనితో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. నిందితులు పోలీసులపై దాడి చేసి తప్పించుకున్నారు. దీనితో వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ అవమానాన్ని భరించలేక బాధిత యువతి ప్రియుడు ఆత్మహత్యకు యత్నించాడు.






