- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితుల ప్రభావం.. CBSE పరీక్షలు వాయిదా
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా, మార్చి 02, 2026 (సోమవారం)న జరగాల్సిన క్లాస్ X మరియు క్లాస్ XII పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు CBSE బోర్డు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల్లో (Middle East) ప్రస్తుతం నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నెలకొన్నాయి. ఈ పరిస్థితులు దృష్ట్యా, మార్చి 02, 2026 (సోమవారం) నాడు జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు CBSE కీలక ప్రకటన చేసింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లోని విద్యార్థులు, పాఠశాలల భద్రతను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ఈ మార్పును గమనించాలని, ఆందోళన చెందవద్దని బోర్డు సూచించింది.
కేవలం మధ్యప్రాచ్య ప్రాంతంలోని పరీక్షా కేంద్రాలకు మాత్రమే ఈ వాయిదా వర్తిస్తుందని, మిగిలిన దేశాల్లో, భారతదేశంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. వాయిదా పడిన ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థులు,తల్లిదండ్రులు తాజా సమాచారం కోసం తమ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించాలని, CBSE అధికారిక పోర్టల్‌ను క్రమం తప్పకుండా గమనించాలని కోరింది.






