- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ నల్లమట్టి తరలింపు
by Ratna Kumari |
ఊట్కూర్ చెరువులో ఆదివారం అక్రమంగా నల్లమట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తూ అధికారుల చర్యలు కోరారు.

X
దిశ, ఊట్కూర్ : ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండటాన్ని అవకాశంగా తీసుకుని ఊట్కూర్ మండల కేంద్రంలోని చెరువులో అక్రమంగా నల్లమట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. టిప్పర్ వాహనాల ద్వారా నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారని, సంబంధిత అధికారులు విధుల్లో లేకపోవడంతో ఈ అక్రమ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై రెవెన్యూ, గనుల శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






