పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న అక్రమ షెడ్ల నిర్మాణాలు

by Ratna Kumari |

అబ్దుల్లాపూర్ మెట్ మండలం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారుతుంది.

పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న అక్రమ షెడ్ల నిర్మాణాలు
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : అబ్దుల్లాపూర్ మెట్ మండలం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారుతుంది. రోజుకొక షెడ్డు ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగు లాగా పుట్టుకొస్తున్నాయి, కనీసం సోయి లేనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రా మత్తులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులకు, టి ఎస్ బి పాస్, విధానాన్ని కొందరు అక్రమార్కులు తుంగలో తొక్కుతూ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్ల నిర్మాణం వాణిజ్య సముదాయాలు, ఏర్పరచుకుంటున్నారు, ఇంత అక్రమంగా భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం బాధ్యతయుతంగా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహంతో మండిపడుతున్నారు, మరికొన్ని షెడ్ల నిర్మాణాలు, నివాస అనుమతులు తీసుకొని అదే అవకాశం చేసుకుంటూ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు, ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే చోటామోటా లీడర్ల పేర్లు చెబుతూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు,

ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా కొనసాగుతున్న బలిజ గూడా రోడ్డులో భారీ షెడ్డు నిర్మాణం..

బలిజగూడ రోడ్డులో భారీ షెడ్డు నిర్మాణం చేస్తున్న షెడ్డు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్న కనీసం బాధ్యత లేకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.

నిబంధనలు తుంగలో తొక్కుతూ షెడ్డు నిర్మాణ పనులు..

నిర్మాణం చేపట్టేటప్పుడు పక్క భవనాలకు రోడ్డు విస్తరణకు కచ్చితంగా వదలాల్సిన కనీస స్థలాన్ని వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు వాహనదారులకు భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు., ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణ షెడ్లను తొలగించాలని ప్రభుత్వానికి రావలసిన ఆధార వనరులని పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story