- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం... డోర్ మూసేయాలని చెప్పినందుకు హత్య
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం చోటు చేసుకుంది. వర్షం పడుతుందని రైలు కోచ్ డోర్ మూయాలని చెప్పినందుకు చెలరేగిన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది.

దిశ, వెబ్ డెస్క్: ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం చోటు చేసుకుంది. వర్షం పడుతుందని రైలు కోచ్ డోర్ మూయాలని చెప్పినందుకు చెలరేగిన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. బుధవారం రాత్రి అంధేరి, బోరివాలి స్టేషన్ల మధ్య ఈ దారుణం జరిగింది. ముంబైలోని విరార్ ప్రాంతానికి చెందిన మయాంక్ లోహర్ అనే యువకుడు అంధేరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. పనిముగించుకుని మయాంక్ తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్‌లో కూర్చున్నాడు. ఆ సమయంలో భారీ వర్షం రావడంతో కోచ్ డోర్ మూసివేయాలని అక్కడే ఉన్న మరో యువకుడికి చెప్పాడు. కానీ అతడు డోర్ మూసేందుకు నిరాకరించగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఈ క్రమంలో తన వద్ద దాచుకున్న పదునైన కత్తిని బయటకు తీసి నింధితుడు మయాంక్ కడుపులో పొడిచేశాడు. ఈ దాడిలో మయాంక్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి జరిగిన సమయంలో రైలులో చాలా మంది ఉన్నా ఎవరూ స్పందించలేదు. నింధితుడు నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ ఆగేలోపే దూకేశాడు. తరవాత స్టేషన్ లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మయాంక్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు తెలిపారు. నింధితుడు పరారీలో ఉండటంతో పోలీసులు ప్రత్యేక బృంధాలతో గాలిస్తున్నారు.






