తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. రేపు కర్ణాటక‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్ రెడ్డి రేపు కర్ణాటక‌కు బయలుదేరనున్నారు.

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. రేపు కర్ణాటక‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డ రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు. హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి (Tungabhadra Dam) నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ఇరువురు హాజరుకాబోతున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం ఈ పర్యటనకు వెళ్తున్నట్లుగా సమాచారం.

కాగా, గతంలో తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) గేట్లు కొట్టుకుపోయిన నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొత్త గేట్ల పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఈ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో రేపు ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. తుంగభద్ర బోర్డు పరిధిలో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉన్నందున, ఈ పర్యటన అంతర్రాష్ట్ర జల సంబంధాల బలోపేతానికి, అలాగే ఆర్డీఎస్ (RDS) వంటి పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారే అవకాశం కూడా ఉంది. ఇదే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story