పర్యాటక రంగంలో సరికొత్త మైలురాయి.. విశాఖకు చేరుకున్న భారీ క్రూయిజ్

by Vemula.Srinu Prasad |

విలాసవంతమైన భారీ క్రూయిజ్ నౌక విశాఖకు చేరుకుంది. 1600 మంది పర్యాటకులతో 22న చెన్నైలో ఈ బయల్దేరింది. 692 అడుగుల పొడవు, 11 అంతస్తులు, 786 కేబిన్లతో ఉన్న ఈ షిప్ బుధవారానికి విశాఖ నగరానికి చేరింది

పర్యాటక రంగంలో సరికొత్త మైలురాయి.. విశాఖకు చేరుకున్న భారీ క్రూయిజ్
X

దిశ, వెబ్ డెస్క్: విలాసవంతమైన భారీ క్రూయిజ్ నౌక(Massive Cruise Ship) విశాఖకు చేరుకుంది. 1600 మంది పర్యాటకుల( Tourists)తో 22న చెన్నై(Chennai)లో ఈ బయల్దేరింది. 692 అడుగుల పొడవు, 11 అంతస్తులు, 786 కేబిన్లతో ఉన్న ఈ షిప్ బుధవారానికి విశాఖ(Visakha) నగరానికి చేరింది. రెండు రోజులు పాటు సముద్రంలో విహారం చేయడంతో పర్యటకులకు ఈ భారీ క్రూయిజ్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. హోటల్స్, స్క్రీన్స్, వినోద కార్యక్రమాలతో క్రూయిజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు పర్యాటక రంగంలో విశాఖ క్రూయిజ్ యాత్ర సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో విశాఖ క్రూయిజ్ రాకపోకలు పెరుగుతున్నాయి.

క్రూయిజ్‌‌లో ప్రయాణించాలంటే..

కాగా కార్డినెల్లా క్రూయిజ్‌లో సముద్ర విహారం చేయాలనుకునే వారికి టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంచి అవకాశం కల్పించింది. ఈ నెల 22 నుంచి జులై వరకూ క్రూయిజ్‌ యాత్రను చేపట్టింది. విశాఖ నుంచి చెన్నైకు నాలుగు, చెన్నై నుంచి విశాఖకు నాలుగు ట్రిప్స్‌ను ఏర్పాటు చేసింది. రెండు రాత్రిళ్లు ఇద్దరు ప్రయాణికులకు రూ.48 వేలు, మూడు రాత్రిళ్లు ఇద్దరి ప్రయాణానికి రూ.70 వేలుగా ప్రకటించింది. ట్రావెల్స్ ఏజెన్సీలో టికెట్లు లభించేలా అవకాశం కల్పించింది. దీంతో 1600 మంది ప్రయాణికులు ఈ నెల 22న చెన్నైలో బయల్దేరి బుధవారానికి విశాఖకు చేరుకున్నారు. సముద్ర విహారం తమకెంతో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని పర్యటకులు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story