- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండ్లు లేని నిరుపేదలకు 100 గజాల స్థలం కేటాయించి పట్టాలు మంజూరు చేయాలి
ఇండ్లు లేని పేదలకు 100 గజాల స్థలం, పట్టాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, రాంనగర్ : ఇండ్లు లేని పేదలకు 100 గజాల స్థలం, పట్టాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 19 సంవత్సరాల క్రితం ఇండ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు కేటాయించకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ సాగర్, ఘట్కేసర్ మండలం కాచవాని సింగారానికి చెందిన పేదలు ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… పేదలు గత 19 నుంచి ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నీలా వెంకటేష్, జి. అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగుర్ల తదితరులు పాల్గొన్నారు.






