పోచమ్మ గుడిలో పోతురాజు విగ్రహం ధ్వంసం

by velandi.Saikiran |

పోచమ్మ గుడిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి గుడిలోని పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన కలకలం రేపింది.

పోచమ్మ గుడిలో పోతురాజు విగ్రహం ధ్వంసం
X

దిశ, అచ్చంపేట : అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో గల పోచమ్మ గుడిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి గుడిలోని పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనోహర్, శ్రీకాంత్ బీమా, నరసింహ గౌడ్ తదితరులు ఆలయాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ఎస్సై సద్దాం హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకొని, సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా నిందితున్ని ప‌ట్టుకున్నారు. బల్మూరు మండలం మహాదేవపూర్ గ్రామానికి చెందిన కొమ్ము బాలస్వామి ఈ ప‌ని చేశాడ‌ని గుర్తించారు. నిందితుడు మతిస్థిమితం కూడా కోల్పోయి ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆలయ పెద్దల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Next Story