- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిలు చదువులో రాణించాలి
చదువులో రాణించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ విద్యార్థినిలకు సూచించారు.

దిశ, మద్దూరు / కొత్తపల్లి: చదువులో రాణించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ విద్యార్థినిలకు సూచించారు. బుధవారం మద్దూరు మండలంలోని పెదిరిపహాడ్ గ్రామంలో 2 కోట్ల 30 లక్షలతో కస్తూరిబా కళాశాల నూతన భవనాన్ని, కస్తూరిబా పాఠశాల అదనపు గదులను కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, కడ అధికారి వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే ప్రణాళికబద్ధంగా ముందుకుపోవాలన్నారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని పెద్దాపూర్ లో 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, దుప్పటి గట్టు, గోర్లోని బావి గ్రామాలలో 40 లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనాలను కడ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తో కలిసి తిరుపతి రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో నిరంతరం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక, ఎస్పీ వినీత్, డీ ఈ ఓ గోవింద రాజులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు& పిఎసిఎస్ చైర్మన్ నరసింహ, కాంగ్రెస్ నాయకులు జనార్ధన్, జీడి వెంకట రాములు, కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






