ఇసుక కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.50 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ ఖనిజా వృద్ది సంస్ధ ఎండీ వైస్​చైర్మన్, ఎండీ అనుదీప్​దురిశెట్టి పేర్కొన్నారు...

ఇసుక కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.50 కోట్లు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ ఖనిజా వృద్ది సంస్ధ ఎండీ వైస్​చైర్మన్, ఎండీ అనుదీప్​దురిశెట్టి పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఇసుక ర్యాండమైజేషన్​బుకింగ్​లు ఉదయం 9 గంటలతో పాటు సాయంత్రం 4 గంటలకు అమలు చేయనున్నట్లు, దీంతో మరింత పారదర్శకత, సమాన బుకింగ్​ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్పొరేషన్​రోజుకు 1.10 లక్షల మెట్రిక్​టన్నులు ఇసుక అందుబాటులో ఉంచుతుందని అందులో 0.63 మెట్రిక్​టన్నులు బుక్​అవుతుండగా, 0.46 మెట్రిక్ టన్నులు బుక్​కాకుండా మిగులుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత అనేది ఎక్కడ లేదని కొందరు కావాలని సంస్దపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇసుక 24 గంటలు అందుబాటులో ఉంటుందని, అవుట్​ఆప్​స్టాక్​అని చూపిస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీజీఎండీసీ వద్ద విక్రయానికి 1.15 కోట్ల మెట్రిక్​టన్నుల ఇసుక తవ్వేందుకు సిద్దంగా ఉందని, ఇసుక బుకింగ్​వ్యవస్ధ పూర్తిగా డిజిటల్, స్వయం చాలక వేదిక ద్వారా నిర్వహిస్తోందన్నారు. అన్ని బుకింగ్​లు ముందు నిర్దేశించిన సిస్టమ్​ప్రోటోకాల్స్ ఆదారంగా సాండ్​సేల్​మేనేజ్​మెంట్ అండ్​మానిటరింగ్​సిస్టమ్​ద్వారా ప్రాసెస్​చేయబడుతుందని వెల్లడించారు. ఆర్డర్ల కేటాయింపులో మానవుల జోక్యం ఉండదని, బుకింగ్ వ్యవస్ధను పారదర్శకత, నిష్పకపాతత్వం, వినియోగదారులందరికి సమాన అవకాశాలు కల్పించే విధంగా రూపొందించ బడిందన్నారు.

మౌలిక వసతుల ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంస్ధలు ఇతర పెద్ద వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు బల్క్​బుకింగ్​సౌకర్యం ప్రవేశపెట్టామన్నారు. అర్హత ప్రమాణాలు, బుకింగ్ పరిమితులు, చెల్లింపు, కేటాయింపు విధానాలు అన్ని దరఖాస్తులకు సమానంగా వర్తిస్తాయని ఎటువంటి వివక్ష ఉండదన్నారు. బల్క్​బుకింగ్​ఆమోదం పొందిన తరువాత కొంతమంది వినియోగదారులు ఒక రీచ్​నుంచి మరో రీచ్​కు ఆర్డర్​బదిలీ చేయాలని కోరితే రుసుము, జరిమానాలు పైలట్​ప్రాతిపదికన విధించబడుతుందని చెప్పారు. ఈనెల 17వ తేదీ నుంచి ఇప్పటివరకు 83 ఆర్డర్లపై రూ.2.83 లక్షల వసూలు చేసినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో అధికారులు ఎల్లయ్య, రాజశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story