అది నా బాధ్యతగా భావిస్తున్నా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కెరీర్‌ను కొనసాగించడం అనేది కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం అని ఆయన అన్నారు.

అది నా బాధ్యతగా భావిస్తున్నా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘వెల్ కమ్ టూ ది జంగిల్’ మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆమ్మద్ ఖాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఊర్వశి రౌటేలా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్ తన 35 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కెరీర్‌ను కొనసాగించడం అనేది కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం అని ఆయన అన్నారు. తన కెరీర్ 40 ఏళ్లు దాటి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చనిపోవడానికి కేవలం ఐదు నిమిషాల ముందు వరకు కూడా తాను షూటింగ్‌లోనే ఉండాలనేదే తన కోరిక అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

మొదట్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చానని, అందుకోసం నిరంతరం కష్టపడటంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు ఏడాదికి ఒక్క సినిమా చేసినా చాలనుకుంటారని.. కానీ తాను ప్రతిరోజు పనిచేయాలనుకుంటానని అన్నారు. అలాగే ఫలితం ఆశించకుండా ఏడాదికి కనీసం నాలుగు సినిమాలైనా చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి పదేళ్ల తర్వాత తన సినిమాలు చూసుకుంటే తనకే అసహ్యం వేసిందని.. కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేయడంతో వేరే పాత్రలు చేయలేనని అందరూ అనుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాతే తనను తాను మార్చుకుంటూ ‘హీరా ఫేరి’, ‘ధడకన్’, ‘టాయిలెట్ ఏ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్‌మ్యాన్’ వంటి వైవిధ్యమైన సినిమాలు చేశానని తెలిపారు.

Next Story