మాదకద్రవ్యాలు వ‌ద్దు.. ఉన్న‌త లక్ష్యాలే ముద్దు

by velandi.Saikiran |

కేసముద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలు వ‌ద్దు.. ఉన్న‌త లక్ష్యాలే ముద్దు
X

దిశ, కేసముద్రం: కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ పాల్గొని విద్యార్థులకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ... గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. విద్యార్థి దశలో లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు తీసుకురావాలని వెల్ల‌డించారు. "సే నో టు డ్రగ్ - సే ఎస్ టు లైఫ్" అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి తిరుపతిరావు ,సిఐ సత్యనారాయణ,ఎస్ఐ క్రాంతి కిరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Next Story