సూపర్ స్టార్ సినిమాతో నా కల నిజమవుతున్నందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా: రాశి ఖన్నా

by Mallepaka Hamsa |

ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’లో నేను కూడా ఒక భాగం కావడం నాకెంతో సంతోషంగా ఉంది.

సూపర్ స్టార్ సినిమాతో నా కల నిజమవుతున్నందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా: రాశి ఖన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నాకు ఎంత కష్టపడినప్పటికీ లక్ కలిసి రాకపోవడంతో ఆమె చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సరైన హిట్ అందుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నారు. తాజాగా, రాశి ఖన్నా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండగా.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కామెడీ కింగ్ యోగిబాబుతో పాటు టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా, జరిగిన టైటిల్ రివీల్ వేడుకల్లో రాశి ఖన్నా పాల్గొని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇందులో నటించడంపై రాశి ఖన్నా మాట్లాడుతూ.. "ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’లో నేను కూడా ఒక భాగం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికీ రజినీ సార్‌తో ఒక్కసారైనా నటించాలనే పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు నా కల నిజమవుతున్నందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ లక్కీ ఛాన్స్ ఇచ్చిన కమల్ హాసన్ సార్‌కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. కమల్ సార్ లాంటి లెజెండ్ వద్ద పని చేయడం గొప్ప అనుభూతి. ఈ సినిమా షూటింగ్ సెట్‌లో రజినీ సార్, కమల్ సార్‌ల నుంచి నటనకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story