- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర శివార్లలో యథేచ్ఛగా అక్రమ హోర్డింగ్స్.. జీవో నెం.68కి నిలువునా తూట్లు
జీహెచ్‌ఎంసీలో అక్రమ హోర్డింగుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అవుట్‌డోర్ మీడియా ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిపోయిందనే విమర్శలున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీలో అక్రమ హోర్డింగుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అవుట్‌డోర్ మీడియా ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిపోయిందనే విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోతపడుతోంది. జీహెచ్‌ఎంసీలో విలీనమైన పురపాలికల్లో అనుమతి లేకుండా హోర్డింగులతో ఖజానాకు ఏటా రూ.500 కోట్ల మేర గండి కొడుతున్నారు. కోర్ సిటీకే పరిమితమైన అక్రమ హోర్డింగుల దందా శివారు పురపాలికల్లో జోరుగా సాగుతున్నది. శంషాబాద్, నార్సిం గి, మణికొండ, శంకర్‌పల్లి, నల్లగండ్ల, ఫిర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో హోర్డింగులు ని బంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి.
నిబంధనలు గాలికి..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి, శంకర్‌పల్లి, తెల్లాపూర్, మణికొండ, శంకర్ పల్లి తదితర ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పా టు చేసిన ఏజెన్సీలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. ముఖ్యంగా బార్కాస్-నాదర్‌గూ ల్, మిరాలం నుంచి హిమాయత్ సాగర్, గండిపేట-శంకర్‌పల్లి, నాగార్జున సాగర్ రోడ్లు, దొంతపల్లి, మోఖిల, గండిపేట-శంక ర్‌పల్లి మార్గంలో కిలోమీటర్ల మేరలో ఏర్పా టు చేసిన హోర్డింగులు అక్రమంగా కొనసాగుతున్నట్లు బహిరంగంగా విమర్శలు వస్తు న్నా అటు వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఆరోపణలకు దారితీస్తోంది. అక్ర మ దందాతో ఈ రంగంపై ఆధారపడి ఉన్న దాదాపు 209 మంది ఏజెన్సీలకు నష్టం జరుగుతున్నది. గతంలో ఏటా రూ.80 కోట్ల మేర ఆదాయం వస్తే గడిచిన ఏడాదిన్నర కాలంగా రూ.30 కోట్లు కూడా రాకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
ప్రాణాలు పోయాకే స్పందిస్తారా..?
జీహెచ్ఎంసీలో విలీనమైన ఘట్‌కేసర్, నార్సింగి-శంకర్‌పల్లి రోడ్డు, పెద్ద అంబర్‌పేట తదితర జాతీయ రహదారుల పక్కనే భారీగా హోర్డింగులు వెలిశాయి. గతంలో గాలివానలకు హోర్డింగులు కుప్పకూలి ప్రాణాలు పోయిన ఘటనలు మరువకముందే మళ్లీ అదే తరహాలో హోర్డింగులు వెలుస్తున్నాయి. విలీనమైన మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల పరిధిలో ట్యాక్స్ ఎగవేతతో పాటు నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులపై అటు హైడ్రా, ఇటు జీహెచ్‌ఎంసీ దృష్టి సారిస్తే అక్రమ దందాకు చెక్ పడుతుందని పలువురు భావిస్తున్నారు. కొందరు అధికారుల ఉదాసీనత వల్ల జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీగా గండిపడుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జీవో నెం.68కి తూట్లు..
జీహెచ్‌ఎంసీలో విలీనమైన ఈ ప్రాంతాల్లో జీవో నంబర్ 68 ప్రకారం 15 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో ప్రకటనల బోర్డులు ఉండకూడదన్న నిబంధనలను అక్రమార్కులు బుట్టదాఖలు చేశారు. గతంలో వీరంతా ఆర్ అండ్ బీ అనుమతి తీసుకుని కొనసాగిస్తున్నట్లు పైకి చెబుతున్నారు. కానీ జీహెచ్‌ఎంసీలోకి విలీనమైన తర్వాత ఇక్కడి నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఆర్ అండ్ బీ పర్మిషన్ ఇస్తే ఎన్‌వోసీ తీసుకుని మున్సిపల్ చట్టం ప్రకారం ట్యాక్స్ చెల్లించి ప్రకటనలను డిస్‌ప్లే చేయాలి. కానీ ఎక్కడ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిలో హోర్డింగులు పెట్టడమే కాకుండా ట్యాక్స్ ఎగవేతతో ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. అందుకు నార్సింగి-శంకర్‌పల్లి మార్గంలో ఉన్న హోర్డింగులే అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బడంగ్‌పేట, తుర్కయాంజల్, జన్వాడ, దొంతుపల్లి, మోఖిల, నార్సింగి, శంకర్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో రహదారికి మధ్యలో ఉన్న హోర్డింగులపై దృష్టి పెడితే జీహెచ్‌ఎంసీ ఖజానాలోకి రూ.వందల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు.






