నన్ను జైల్లో పెట్టండి.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే

by Vinod kumar |

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే - "If You Want To Jail Me..": Uddhav Thackeray To BJP On Raids

నన్ను జైల్లో పెట్టండి.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
X

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలోకి రావాలనుకుంటే, నీచమైన పనులన్ని చేయొద్దని అన్నారు. తమ కుటుంబ సభ్యులను హతమార్చ వద్దని అన్నారు. తామెప్పుడూ ఇతరుల కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టలేదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.


'మీ కుటుంబాలు ఏదో తప్పు చేశాయని లేదా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టగల ఏదో ఉందని మేము చెప్పడం లేదు. ఒకవేళ మీరు మమ్మల్ని జైలులో పెట్టాలి అనుకుంటే, అధికారంలోకి రండి. జైళ్లో పెట్టండి అని భావోద్వేగంగా అన్నారు. కాగా రెండు రోజుల క్రితమే ఉద్ధవ్ బంధువులకు చెందిన రూ.6.45 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఫ్రీజ్ చేసింది. ఇప్పటికే అనిల్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్ వంటి నేతలను కేంద్ర సంస్థలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Next Story