- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మీ ఆశీర్వాదం కావాలి: సంజూ శాంసన్
టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు సంజూ శాంసన్ భావోద్వేగ సందేశం. తన కెరీర్‌లోనే అతిపెద్ద మ్యాచ్ అని పేర్కొంటూ అభిమానుల ఆశీర్వాదాలు కోరిన టీమిండియా స్టార్.

దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది గంటల్లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ (T20 World Cup match) ప్రారంభం కానుండగా.. ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) భావోద్వేగ పోస్ట్ చేశారు. సంజూ శాంసన్ అభిమానులకు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించాడు. తన కెరీర్‌లోనే ఇది అతిపెద్ద మ్యాచ్ అని పేర్కొంటూ..ఈ కీలక సమయంలో అభిమానుల ప్రేమ, పూర్తి మద్దతు తనకు కావాలని కోరాడు. "మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఫైనల్ మ్యాచ్‌లో నేను సెంచరీ సాధించి టీమిండియాకు ప్రపంచ కప్ అందించాలని కోరుకుంటున్నాను" అని సంజు భావోద్వేగంతో పంచుకున్నాడు.
ఈ టీ20 ప్రపంచ కప్ లో జట్టుకు అవసరమైన సమయంలో మంచి స్కోరును అందించిన సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 77.33 సగటుతో, 201.73 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 232 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 97 పరుగులు చేసి విజయంలో ముఖ్యపాత్ర పోషించిన సంజు, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో కూడా 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజు, ఫైనల్ పోరులో కూడా రాణించి భారత జట్టును విజేతగా నిలబెట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన లక్షా 30 వేల టికెట్లు అమ్ముడుపోగా..15 వేల మంది పోలీసులు, ఇతర సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






